calender_icon.png 3 April, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వం జారుడు బల్లపై ఉంది

02-04-2025 11:29:13 PM

- గల్లీ గల్లీకి గంజాయి సప్లయ్ అవుతోంది.. 

- ముఖ్యమంత్రి అసమర్థత వల్లే మహిళలపై అఘాయిత్యాలు..

- బీసీల వాటా తేల్చాల్సి వస్తుందనే హెచ్సీయూ ఘటన తెరమీదకి..

-  బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సుడిగుండంలో చిక్కుకున్న పడవ మాదిరి జారుడు బల్లపై నడుస్తోందని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా వైద్యంతో పాటు హోం శాఖ పూర్తిగా వైఫల్యం చెందిందని అవగాహన లేని కారణంగానే తన వద్ద హోం శాఖను ఉంచుకొని అమాయక మహిళలపై అఘాయిత్యాలకు పరోక్షంగా కారకుడు అవుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ప్రస్తుతం మేమెంతో మాకంతా అనే నినాదంతో బీసీలంతా ఐక్య పోరాటాలు చేస్తుండగా 42 శాతం వాటా కల్పిస్తున్నామని అసెంబ్లీలో ఆమోదింపజేసి కేంద్రానికి పంపి చేతులు దులిపేసుకున్నాడని ఆరోపించారు.

బీసీల వాటా తెల్చాల్సి వస్తుందని ప్రస్తుతం హెచ్సీయూ ఘటనను తెరమీదకి తీసుకొచ్చారని ఆరోపించారు. యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి వారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. గ్రామాలలో యువత మద్యం గంజాయి మత్తుకు బానిసలుగా మారారని గల్లి గల్లికి గంజాయి సప్లై జరుగుతోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే యువత పెడదోవన పడి అమాయక మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలే లక్ష్యంగా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రములో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయనీ దుయ్యబట్టారు.

ఉర్కొండ మండల కేంద్రంలో జరిగిన సంఘటనపై, సీఎం పూర్తి స్థాయి విచారణ చేపట్టాలనీ కోరారు. కార్యక్రమంలో సెంట్రల్ స్టేట్ కో ఆర్డినేటర్స్ దాగిళ్ళ దయానంద్ రావు, నిషానీ రామచంద్రంలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శివరామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుండెల ధర్మేందర్, అంతటి నాగన్న, జిల్లా ఇంచార్జీలు బీసమోళ్ళ యోసేఫ్, పృధ్వీరాజ్, జిల్లా అధ్యక్షులు రాంచందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి హర్ష ముదిరాజ్, వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు మిద్దె మహేష్, అసెంబ్లీల ఇంచార్జీలు కొత్తపల్లి కుమార్, వెంకటేష్, ఆంజనేయులు, కృపానందం, మోహన్ రెడ్డి, అసెంబ్లీల అధ్యక్షులు కళ్యాణ్, కురుమయ్య, మల్లన్న, బాలు నాయకులు మీడియా శ్రీనివాస్, నాగేష్, భాస్కర్, నాగరాజు, మహేష్, రాజేష్, వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.