calender_icon.png 15 March, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

15-03-2025 12:00:00 AM

గజ్వేల్ లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం 

గజ్వేల్, మార్చి14: ప్రజా సమస్యలపై నిలదీస్తే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖూనీ చేస్తుందని ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం గజ్వేల్లో బిఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ సందర్భంగా ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ  గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో నిలదీస్తుంటే ప్రశ్నిస్తూ కడిగి వేస్తా ఉంటే, దాని జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం చాలా సిగ్గుచేటన్నారు. భారత రాజ్యాంగంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కును రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. 

జగదీశ్వర్ రెడ్డి ఏం తప్పు చేశారని ఎందుకు సస్పెండ్ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే  రైతులు  సాగునీరు కోసం ఎదురు చూస్తుంటే  ప్రభుత్వానికి కనికరం లేకుండా చుక్క నీరును కూడా రైతులకు అందించకపోవడం చాలా బాధాకరమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్  ఎం సి రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దిన్, నవాజ్ మీరా,  బెండ మధు, మల్లేశం,  గోపాల్ రెడ్డి, గుంటుకు రాజు, గంగిశెట్టి రవీందర్,  కనకయ్య,  శ్రీధర్, జ్యోతి స్వామి, నాయకులు  శ్రీనివాస్ రెడ్డి,  శీను, దయానంద రెడ్డి  తదితరులున్నారు.