calender_icon.png 13 January, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదు

12-01-2025 09:52:03 PM

అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది

పార్టీ ఫిరాయించిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ క్షమించదు

అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫలం చెందిన ఆ పార్టీలో పోచారం ఎందుకు చేరారో చెప్పాలి?

బాన్సువాడలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదనీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) మండిపడ్డారు. రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి 12 వేలకు తగ్గించడానికి తీవ్రంగా ఆక్షేపించారు. రైతుల కోసం కేసిఆర్(KCR) పెట్టిన అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందనీ ఆమె స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం నాడు ఎమ్మెల్సీ కవిత బాన్సువాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనీ, ముఖ్యంగా మహిళలకు, ఆటో డ్రైవర్లకు, కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిందని తెలిపారు. ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 12 వేలను వెంటనే చెల్లించాలనీ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆర్ఎస్ఎస్ దిశా నిర్దేశంలో పనిచేస్తున్నాడని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తుందని, గత ఏడాది కాలంలో ఒక్క ప్రాజెక్టులో కూడా తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదనీ ఎత్తి చూపించారు.

గురుకులాల్లో తిండి సరిగలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, అనేక ప్రభుత్వ గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు మరణిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కాగా, రైతు భరోసా సాయం విషయంలో మాట మార్చిన కాంగ్రెస్ పార్టీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) ఎందుకు కొనసాగుతున్నారనీ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైనా ఆ పార్టీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు చేరారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరని, కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీ(BRS Party)కి పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్రోహం చేశారని అన్నారు. పదివేల బీఆర్ఎస్ పాలనలో బాన్సువాడ నియోజకవర్గానికి ఏడాదికి వెయ్యి కోట్ల చొప్పున కేసిఆర్ పది వేల కోట్లు ఇచ్చారని, కాంగ్రెస్ పాలనలో ఏడాదికి 1000 కోట్లు పోచారం తీసుకురాగలుగుతారా...? అని ప్రశ్నించారు. ప్రజలకు పనికిరాని పార్టీ మారుడు ఎందుకు...? అని అడిగారు. కొంతమంది నాయకులు పార్టీ మారిన బీఆర్ఎస్ తో ప్రజలు, కార్యకర్తలు ఉన్నారని, బాన్సువాడతో పాటు తెలంగాణ వ్యాప్తంగా గులాబీ జెండా ఎగరేద్దామని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.