calender_icon.png 19 March, 2025 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తుద్ధిని చాటుకుంది

18-03-2025 07:08:49 PM

తెలంగాణ మలిదశ ఉద్యమకారులు కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ..

కోదాడ (విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపచేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకుందని కాంగ్రెస్ నాయకులు తెలంగాణ మలిదశ ఉద్యమకారుల రాయపూడి వెంకటనారాయణ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఈ బిల్లులను రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ బిల్లులను పార్లమెంట్లో ఆమోదింప చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని, కేంద్రంపై రాష్ట్ర బిజెపి నాయకులు ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. బీసీ కులగనన ఎస్సీ వర్గీకరణలో సబ్ కమిటీ చైర్మన్గా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని, రెండు బిల్లులు అసెంబ్లీలో ఆమోదింప చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు.