calender_icon.png 20 November, 2024 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముదిరాజుల సంక్షేమాన్ని మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం

20-11-2024 01:10:46 PM

చేప పిల్లల పంపిణీ లేక ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు 

తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి

రేపు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ జెండా ఆవిష్కరణ  

గజ్వేల్ (విజయక్రాంతి): బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీల అభివృద్ధికి హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత హామీల ఆమలులో నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి అన్నారు. బుధవారం ఆయన గజ్వేల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ  ఏర్పడి పదేండ్లు పూర్తయినందున దశాబ్ది ఉత్సవాలతో పాటు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం పల్లె పల్లె నా, గ్రామ గ్రామాన ముదిరాజ్ జెండాను ఎగరవేయాలని ముదిరాజ్ సంఘాల నాయకులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముదిరాజుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. వానాకాలం పూర్తయినా రాష్ట్రంలో చేప పిల్లల పంపిణీ చేపట్టక ముదిరాజులు ఉపాధి కోల్పోయారన్నారు.

కామరెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం కులగరణ పూర్తి చేసి జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగే రిజర్వేషన్లలో ముదిరాజులకు జనాభాకు తగట్లు వాటా కేటాయించాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలన్నారు. అభయహస్తంలో పేర్కొన్న హామీ ప్రకారము జి.వో.15 ప్రకారం ముదిరాజ్ బి.సి. “డి” నుండి బి.సి. “ఏ” లోకి మార్చాలన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రభుత్వ జీవో ప్రకారం చెరువు కుంటలపై, తెనుగు/ ముత్తరాశి/ ముదిరాజ్, బెస్త, గంగపుత్ర, గూండ్ల కులాలకు మాత్రమే హక్కులు ఉండే విధముగా చట్టపరమై ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ముదిరాజులు గురువారం ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా కొట్టాల యాదగిరి  పిలుపునిచ్చారు.