24-02-2025 12:22:26 AM
ఆదిలాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): దేశంలో ఎక్కడ ఎన్నికలు జరి గినా ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపి భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబా ద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, కాంగ్రెస్ సీఎం రేవంత్‌పై చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నారని, ప్రభు త్వం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఆదాయంపై అంచనా లేకుండా అధిక ఖర్చులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించ డం లేదని, ప్రాజెక్టులు పూర్తి చేయ డం లేదని, దీంతో బిల్డర్స్ పనులు ఆపేశారన్నారు.
బిల్డర్ల దగ్గర కాంగ్రె స్ నాయకులు వాటాలు అడుగుతున్నారని ఆరోపించారు. అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సవాళ్లను తాను స్వీకరిస్తున్నారని.. 20, 30 శా తం అభివృద్ధి చేసి సవాల్ విసిరితే బాగుండేదని, ఏమి చేయకుండా స వాల్ విసరడం ఏంటని ఎద్దేవా చేశా రు. ప్రచారంలో జిల్లా గ్రంథాలయం లో విద్యార్థులు, యువతతో కలిసి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలను గెలిపించా లని కోరారు. అంతకు ముందు ఎం పీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, హరీశ్‌రావులతో కలిసి పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందంతో పాటు పలు వురు నాయకులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లకు పూర్తి మద్దతు..
బీసీ రిజర్వేషన్లకు బీజేపీ పూర్తి మ ద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని, కులగణనను తాము అడ్డుకుంటున్నామనేది అవాస్తవమని చెప్పారు.