calender_icon.png 27 November, 2024 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీటు వదలనంటే వదలం!

23-11-2024 12:00:00 AM

  1. బదిలీ ఉత్తర్వులు వచ్చినా కదలరు
  2. సింగరేణి ఆర్జీ-1 సివిల్ డిపార్ట్‌మెంట్‌లో అధికారుల తీరు వివాదాస్పదం

రామగుండం, నవంబర్ 22: సింగరేణి రామగుండం-1 డివిజన్ సివిల్ డిపార్ట్‌మెంట్‌లో బదిలీ ఉత్తర్వులు వచ్చినా కొందరు అధికారులు కదలడం లేదు. చాలా ఏళ్లుగా అదే డిపార్ట్‌మెంట్‌లో పాతుకుపోయిన అధికారుల తీరు వివాదస్పదమైంది. సివిల్ కాం ట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు రుచి మరిగిన సద రు అధికారులను ఇటీవల బదిలీ చేస్తూ కార్పొరేట్ కార్యాలయం నుంచి ఉత్తర్వు లు వెలువడ్డాయి.

అయినప్పటికీ సద రు అధికారులు ఆ కుర్చీని వదలకపోవడం చర్చనీయాంశంగా మారింది. సింగ రేణి వ్యాప్తంగా ఆయా సివిల్ డిపార్ట్‌మెంట్‌లో లాంగ్ స్టాండింగ్‌లో పని చేస్తున్న 13 మంది సీనియర్ సూపర్‌వైజర్‌లను కార్పొరేట్ జీఎం (పర్సనల్) ఈ నెల 8న బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా 20వ తేదీలోగా రిలీవ్ ఆర్డర్ తీసుకోవాలని ఆదేశించారు.

వీరిలో ఆర్జీ-1 నుంచి ఇద్దరు అధికారులు ఉండగా మిగతా ఏరియాలలో బదిలీలు జరిగినప్పటికీ, ఆర్జీ-1 సివిల్ డిపార్ట్‌మెంట్‌లో మాత్రం బదిలీలను అమలు చేయలేదని సమాచారం. చాలా కాలంగా ఇక్కడ పని చేస్తూ కాంట్రాక్టర్లతో బేరసారాలు నడుపుతున్న సదరు అధికారులు ఇక్కడ నుంచి వెళ్లేందుకు ఇష్టపడక కార్పొరేట్ ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తు న్నారు.

తమ బదిలీలను నిలుపుదల చేయించుకునేందుకు ఇక్కడే ఉండి మంతనాలు జరుపుతున్నట్లు సివిల్ డిపార్ట్‌మెం ట్‌లో జోరుగా చర్చ జరుగుతున్నది. సదరు అధికారుల్లో ఒకరు గతంలో వివాదస్పద సంఘటనలో పట్టుబడిన వ్యవహారం కూడా ఇప్పు డు తెరపైకి వచ్చింది.

సివిల్ కాంట్రాక్టర్ల నుంచి వచ్చే కమీషన్లకు అలవాటు పడిన సదరు అధికారిని బదిలీ చేసినప్పటికీ కార్యాలయం వీడకుండా ఉండటంపై పలువురు సివిల్ కాంట్రాక్టర్లు కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.