calender_icon.png 22 February, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిఫ్టులో ఇరుక్కున్న బాలుడి పరిస్థితి విషమం..

21-02-2025 11:41:22 PM

హైదరాబాద్: నగరంలోని మాసబ్ ట్యాంక్(MassabTank) శాంతినగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లిఫ్టులో ఇరుక్కున్న బాలుడి పరిస్థితి విషమంగా ఉందని నిలోఫర్ హస్పిటల్(Niloufer Hospital) సూపరింటెండెంట్ తెలిపారు. బాలుడి శరీర లోపలి భాగాలు పూర్తిగా నలిగిపోయి దెబ్బతిన్నాయన్నారు. బాలుడు లిఫ్టులో 2 గంటలకు పైగా ఇరుక్కుని పోయి ఉన్నాడని, ఆక్సిజన్ అందక, రక్తప్రసరణ లేక అవయవాలు దెబ్బతిన్నయని వైద్యులు వెల్లడించారు. చికిత్స చేసినప్పటికీ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం బాలుడికి వెంటిలేటర్(Ventilator)పై చికిత్స అందిస్తున్నామని నిలోఫర్ సూపరింటెండెంట్(Niloufer Superintendent) తెలిపారు. కాగా, ఆరేళ్ల బాలుడు మధ్యాహ్నం అపార్ట్ మెంట్ లోని లిఫ్టులో ఇరుక్కున్న విషయం తెలిసిందే.