calender_icon.png 9 February, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టర్ ఫ్లాప్ సినిమాలగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి...

08-02-2025 11:06:58 PM

స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..

మాజీ మంత్రి జోగు రామన్న.. 

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఏడాది కాలానికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు వచ్చిన వ్యతిరేకతను చూస్తే సినిమా రంగంలో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా పరిస్థితి మాదిరి గానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఉందని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న ఎద్దేవా చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై  పార్టీ శ్రేణులకు ఆయన దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ... స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రజా సంక్షేమాన్ని మరిచి, అభివృద్ధి పక్కదోవ పట్టిస్తూ తన కబ్జాల వ్యాపారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు.ఈ సమావేశంలో నాయకులు మనోహర్, నారాయణ, నర్సింగరావు, ప్రహ్లద్, జగదీష్, గోవర్ధన్, లింగారెడ్డి తదితరులన్నారు.