calender_icon.png 12 February, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాడికి పాల్పడిన నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ఆందోళన

11-02-2025 08:44:46 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): ఈనెల 7న బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ లో గల ఎస్ ఆర్ ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లో తాండూరు మండలానికి చెందిన బండారి వంశీ అనే యువకుడిపై బీరు సీసాతో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన ముగ్గురు పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం బెల్లంపల్లి ఏసిపి కార్యాలయం ఎదుట బాధితుని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

బీర్ సీసాతో విచక్షణరహితంగా తీవ్రంగా గాయపరిచినా నిందితులపై పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వెంటనే పోలీసులు నిందితులపై రౌడీ షీట్ నమోదు చేయాలని, లేనట్లయితే ఈ సంఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. తమ ఆందోళనకు బెల్లంపల్లి ఏసిపి స్పందించారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. 

నిందితులపై రౌడీ షీట్ నమోదు చేస్తాం.... ఏసీపీ ఏ. రవికుమార్ 

బెల్లంపల్లి ఎస్ ఆర్ ఆర్ బార్ లో తాండూర్ మండలానికి చెందిన బండారి వంశీ అనే యువకున్ని బీర్ సీసాతో గాయపరిచిన సంఘటనలో ముగ్గురు వ్యక్తులపై రౌడీషీట్ నమోదు చేస్తామని బెల్లంపల్లి ఏసిపి ఏ.రవికుమార్ స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఈ ముగ్గురు నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.