calender_icon.png 22 January, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనర్హులకు లబ్ధి చేకూరేలా ఎంపిక చేశారని ఆందోళన

21-01-2025 05:50:45 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అనర్హులకు పథకాలను ఎంపిక చేశారని అధికారులను కాంగ్రెస్ పార్టీ నాయకులను రెబ్బెన మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో ప్రజలు నిలదీశారు. ప్రజా పాలన పథకాల అమలులో భాగంగా ఎంపిక చేపట్టేందుకు మంగళవారం రెబ్బెన మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. కొంతమంది ప్రజలు నిలబడి సర్వేలో పేద ప్రజలకు కాకుండా అనర్హులకు లబ్ధి చేకూరేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారి పేర్లను సర్వేలో నమోదు చేశారని ఆరోపించారు. గ్రామ సభలో కొంతసేపు ఆందోళన చేపట్టారు. ఎంపీడీవో తహసిల్దార్ కల్పించుకొని అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఆందోళనకారులకు నచ్చ చెప్పారు. సర్వేలో నమోదు కానీ వారు గ్రామసభలలో, ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్ వద్ద దరఖాస్తు చేసుకోవచ్చని సూచించడంతో ఆందోళనను విరమించారు.