calender_icon.png 15 November, 2024 | 12:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర సర్వే దేశంలోనే గొప్ప కార్యక్రమం

10-11-2024 01:50:04 AM

  1. ఎన్యుమరేటర్లతో కలెక్టర్లు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలి
  2. మంత్రులు, ఎమ్మెల్యేలను భాగస్వాములను చేయండి
  3. ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): దేశంలో సమగ్ర సర్వే గొప్ప కార్యక్రమమని, అధికారులు చూపే నిబద్ధతపైనే దీని విజయం ఆధారపడి ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశం మొత్తం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సర్వేను గమనిస్తుందన్నారు.

శనివా రం ఇంటింటి సర్వే ప్రారంభమైన నేపథ్యంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఎన్యుమరేటర్లతో కలెక్టర్లు ఎప్పటి కప్పుడు మాట్లాడాలని, అప్పుడే ప్రజలు నుంచి వస్తున్న సందేహాలు ఏమితో తెలుస్తాయన్నారు. ప్రజల సందేహాలను కలెక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి నివృత్తి చేసుకోవాలని ఆదేశించారు.

సర్వేను ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముం దుకు తీసుకెళ్తున్న అధికారులను భట్టి అభినందించారు. హౌస్ లిస్టింగ్‌ను విజయవం తంగా పూర్తి చేశారని, ఇదే రీతిలో సర్వేను విజయవంతంగా నిర్వహించాలన్నారు. సర్వే విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఏ అంశాన్ని నిర్లక్ష్యం చేయొద్దన్నారు.

సర్వేపై కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలోని అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రధానంగా పట్టణాలపై దృష్టి పెట్టాలని కోరారు. సర్వేలో మంత్రు లు, ఎమ్మెల్యేలు భాగస్వాములయ్యేలా చూ డాలని సూచించారు. కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ప్రణాళికశాఖ ము ఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.