11-02-2025 06:35:53 PM
నిర్మల్ (విజయక్రాంతి): విద్యారంగ సమస్యల పరిష్కారం కోసమే ఉపాధ్యాయ వృత్తిని వదిలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు నిర్మల్ కు చెందిన వై సాయన్న తెలిపారు. 30 సంవత్సరాల పాటు జిల్లాలో ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించి బీసీల హక్కుల కోసం అనేక ఉద్యమాలను చేసిన తన సేవలను గుర్తించి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొట్ట శేఖర్ ఉన్నారు.