నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యారంగంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారం కోసమే కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్టు నిర్మలకు చెందిన విద్యావేత్త నంగే శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కరీంనగర్లో కలెక్టర్ సత్పతికి నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్టు వివరించారు. ఉత్తర తెలంగాణతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ బరిలో పోరాటం చేసేందుకు పోటీ చేయడం జరుగుతుందని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే విద్యారంగ సమస్యల పరిష్కారానికి విచ్చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.