- ఇబాదత్ ఖానాను స్వాధీనం చేసుకోవాలి
- వక్ఫ్ బోర్డును ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు
హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాం తి): హైదరాబాద్లోని దారుల్ షిఫాలోని ఇబాదత్ ఖానాకు ముతావలి కమిటీకి ఏడుగురు సభ్యులను తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు నియమిస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్ చెల్లవని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇబాదత్ ఖానాను వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవాలంది. ఈ మేరకు జస్టిస్ నగేష్ భీమపాక ఇటీవల తీర్పు చెప్పారు.
ఇబాదత్ ఖానా ఆస్తిని 1953లో ఇద్దరు వాకీఫ్లు విరాళంగా ఇచ్చా రు. ఆ దాతలు ఇద్దరితోపాటు ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటైంది. వీరంతా తమ వారసుల పేర్లను వెల్లడించకుండానే చనిపోయారు.1994లో వక్ఫ్ బోర్డు 10 మంది సభ్యులతో ఒక ముతావలీ కమిటీని ఏర్పా టు చేసింది. వీళ్లు కూడా తమ వారసుల్ని పేర్లను వెల్లడించకుండానే మృతి చెందారు.
2007లో వక్ఫ్ బోర్డు ఒకరిని కమిటీకి అధ్యక్షుడిగా నామినేట్ చేసింది. 2023లో తిరిగి వక్ఫ్ బోర్డు ఏడుగురు సభ్యులతో కమిటీకి నామినేట్ చేసింది. గతంలో జరిగిన విషయాలను ప్రస్తావించకుండా తాజాగా ప్రొసీడింగ్స్ జారీ చెల్లదని పిటిషనర్ మీర్ లుక్మాన్ అలీ పిటిషన్ వేశారు.
దీని తరఫు సీనియర్ లాయర్ పి.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, గతంలోని నామినేట్ చేసిన విషయాలను వక్ఫ్బోర్డు దాచిపెట్టిందన్నారు. దీనిపై వక్ఫ్ బోర్డు లాయర్ వాదిస్తూ, పిటిషనర్ వక్ఫ్ ట్రిబ్యునల్లో కేసు వేయకుండా హైకోర్టును ఆశ్ర యించడం చెల్లదన్నారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు, వక్ఫ్ బోర్డు వాదనను తిరస్కరించింది.
1994, 2007లో జారీ చేసిన ప్రొసీడింగ్ల ప్రస్తావన చేయకుండా తాజా ప్రొసీడింగ్స్ ఇవ్వడం చెల్లదంది. కాబటి ముతవలి కమిటీ ఏర్పాటు చెల్లదని తేల్చింది. కనుక 2023లో జారీ చేసిన ప్రొసీడింగ్స్ చెల్లవని, ఇబాదత్ఖాన్ నిర్వహణ బాధ్యతలను వక్ఫ్ బోర్డే స్వయంగా పర్యవేక్షణ చేయాలంది. చట్ట నిబంధనలకు అనుగుణంగా మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేయాలంది.
ఆ కమిటీ నియామకంలో షియా ఇమామియా ఇసారి కమ్యూనిలోని అక్బరి, ఉసూ లి తెగలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని తీర్పులో పేర్కొంది.