calender_icon.png 17 January, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కమిటీ కుర్రోళ్లు’ అలరిస్తారు

07-08-2024 12:05:00 AM

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశం

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. ఈ నెల 9న రిలీజ్ కాబోతున్న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సోమవారం రాత్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా వరుణ్ తేజ్, సాయిదుర్గతేజ్, అడివి శేష్, వెంకీ అట్లూరి అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమంలో వీడియో సందేశంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. “మా నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రాన్ని ఆల్రెడీ నేను చూశాను. నిహారిక మల్టీటాలెంటెడ్. మంచి చిత్రాలు నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటోంది.

యదు వంశీ గారికి ఇది మొదటి చిత్రం. సినిమాకు పని చేసిన అందరికీ మంచి పేరొస్తుంది’ అని అన్నారు. నాగబాబు మాట్లాడుతూ.. ‘ఫణి గారు మొదట అడిగినప్పుడు కథను నేను వినలేదు. నిహారిక ఆల్రెడీ కథ వినేసింది. చాలా నచ్చింది.. ఓ సారి వినండి నాన్నా అని నిహారిక చెప్పింది. వంశీ డ్యాన్స్, ఫైట్స్ లేకుండా సినిమా చూపించాడు. కరెక్ట్‌గా తీస్తే సినిమా బాగుంటుందని అర్థమైంది. నిహారికకు మంచి జడ్జ్‌మెంట్ ఉంటుంది. తెలిసిన మొహాలతో సినిమా చేయాలనుకుంది. కానీ కొత్త మొహాలైతే బాగుంటుం దని నేను అనుకున్నాను. దర్శకుడూ నాలానే ఆలోచించాడు.

ఇందులో  నటించిన వారికి కూడా దాదాపు ‘పునాది రాళ్లు’ టైంలో చిరంజీవి గారికి ఉన్న ఏజ్ ఉం టుంది. యంగ్ స్టర్స్ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది. ఎండింగ్ ప్రముఖ నాయకుడ్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, అడివి శేష్, వెంకీ అట్లూరి, నిహారిక కొణిదెల, డైరెక్టర్ యదు వంశీ, నిర్మాత ఫణితోపాటు చిత్రబృందం మాట్లాడి అనుభవాలు, అభిప్రాయాలు తెలిపారు.