calender_icon.png 3 February, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారం ఉంది కదా అని.. ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు..

02-02-2025 10:08:29 PM

అర్హులైన వారికే ఇల్లు మంజూరు చేస్తాం..

నాయకులంతా జాగ్రత్తగా వ్యవహరించాలి..

మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ..

ప్రతి గింజను కొనుగోలు చేస్తాం...

వైరా (విజయక్రాంతి): ఈనెల 15 తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్.. అధికారం ఉంది కదా అని.. ఇష్టానుసారంగా వ్యవహరించొద్దని.. నాయకులంతా  జాగ్రత్తగా వ్యవహరించాలని.. ఈనెల 15 తర్వాత నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం రాత్రి చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర చర్చ జరుగుతుంది. వైరా మండల పరిధిలోని విప్పలమడక గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తో కలిసి పాల్గొన్న అనంతరం మంత్రి పొంగులేటి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.

సొంతింటి కల కోసం గప్పడంత ఆశలతో గత ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం కు ఓటేసి గెలిపించారని, ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో ఇల్లు అర్హులకు మంజూరు గాక పోవటంతో నిరాశతో ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారి నిరాశకు కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులేనని భావించి ఆయన అధికారం ఉంది కదా అని ఇస్తానుసారంగా ఎవరి చూద్దనే వ్యాఖ్య చేశారా..? అన్న విషయంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. నాయకులంతా జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యాఖ్య కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకు బలాన్ని ఇస్తుందని పలువురు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇటువంటి ఆసక్తికర వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటో అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. పార్టీ నాయకుల తీరుపై అసహనంతో వారిని సున్నితంగా మందలించారనే విషయం కూడా చర్చకు వస్తుంది. ఏది ఏమైనప్పటికీ పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు కొంత రాజకీయ వేడిని రాజేశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.