calender_icon.png 23 October, 2024 | 9:02 AM

భక్తుల సౌకర్యానికి ప్రాధాన్యమివ్వాలి

11-07-2024 12:08:29 AM

ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల 

యాదాద్రి ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష

యాదాద్రి భువనగిరి, జూలై 10 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆలయ అధికారులను ఆదేశించారు. భక్తులు గర్భాలయం లో స్వామివారిని దర్శించుకోవడానికి అనువుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్‌ను బుధవారం వారు ప్రారంభించారు.

అదే విధంగా కొండపై బస్టాండ్ వద్ద సులభ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భక్తులు సేద తీరడానికి అవసరమైన షెడ్ల నిర్మాణం తక్షణమే చేపట్టాలని సూచించారు. అన్న ప్రసాదం వీలైనంత ఎక్కువ మందికి అందించడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. భక్తులు స్వామివారి దర్శ నం అనంతరం సేద తీరడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించా రు. అనంతరం ఎమ్మెల్యే, ఎంపీ స్వామివారిని దర్శించుకున్నారు. సమావేశంలో ఆల య అనువంశిక ధర్మకర్త బీ నర్సింహ మూర్తి, ఈవో ఏ భాస్కర్‌రావు, డిప్యూటీ ఈవో దోర్బ ల భాస్కర్ శర్మ, ఈఈ దయాకర్‌రెడ్డి, ఏఈవోలు రమేశ్ బాబు, రఘు, కృష్ణ, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.