ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్
ఆదిలాబాద్, నవంబర్ 15 (విజయ క్రాం తి): ఆదివాసీ తొలి తరం పోరాట యోధు డు, బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన సాతంత్య్ర సమర యోధుడు బీర్సా ముం డా అని, ఆయన పోరాటాన్ని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ పిలుపునిచ్చారు. బీర్సా ముం డా జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని రైలేస్టేషన్ సమీపంలో బీర్సా ముండా విగ్రహానికి నివాళి అర్పించి మాట్లాడారు. ఆయ న పోరాటాలు నేటి యువతకూ స్ఫూర్తి దాయకమన్నారు.
అదేవిధంగా వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధర్యంలో రాష్ట్రీయ జనజాతి గౌరవ దివస్ సందర్భంగా నిరహిం చిన భగవాన్ బీర్సా ముండా జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుతాలు ఆదివాసీ ఉద్యమాలను చిన్నచూపు చూశారని, కానీ మోదీ ప్రభుతం బిర్సా ముండా జయంతిని జనజాతి గౌరవ దివస్ పేరుతో వేడుక నిర్వహిస్తున్నదని కొనియాడారు. బిర్సా ముండా ఆదివాసీల కోసమే కాకుం డా దేశ ప్రజలందరి పక్షాన బ్రిటీష్ వారితో పోరాడారన్నారు.
ఖమ్మంలో..
ఖమ్మం, నవంబర్ 15 (విజయక్రాంతి): గిరిజన సాంస్కృతిక వారసత్వం, జాతీయ గౌరవాన్ని పరిరక్షించి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ అధి కారిణి విజయలక్ష్మి అన్నారు. బిర్సా ముండా జయంత్రి సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన ‘గిరిజన గౌరవ దినో త్సవ సమరోహం’లో ఆమె మాట్లాడారు. ఆయన స్ఫూర్తి తో ప్రభుత్వం ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్నదన్నారు. బడ్జెట్‌లో ఎస్టీల కోసం రూ.17 వేల కోట్లు కేటాయించిందన్నారు.అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కరీంనగర్‌లో..
కరీంనగర్ సిటీ, నవంబరు 15: నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్‌లోని బైపాస్‌రోడ్ ప్రభుత్వ గిరిజన డిగ్రీ కళాశాలలో బిర్సా ముండా జయంతి వేడు క జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎస్ నాగార్జున ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. బిర్సాముండా జయంతిని గిరిజన స్వాభిమాన దినోత్సవంగా, జనజాతి గౌరవ దినోత్సవంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. పార్లమెంట్ ఆవరణలో బిర్సాము ండా చిత్రపటం, విగ్రహం ప్రతిష్ఠించడం హర్షణీయమన్నారు.
కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సీహెచ్ శ్రీని వాస్, నెహ్రూ యువకేంద్ర అధికారి బసవ త్రి రవీందర్, జిల్లా యువజన అవార్డీ తొర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.