calender_icon.png 9 January, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైన్స్ స్క్వేర్ ను ప్రారంభం చేసిన కలెక్టర్

06-12-2024 07:12:01 PM

నిర్మల్ (విజయక్రాంతి): సమాజం అభివృద్దిలో సైన్స్ ప్రాదాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించి విధ్యార్థులకు సైన్స్‌పై విసృత అవగాహాన కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామాస్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ స్క్వేర్ ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా గ్రాంథాలయ ఛేర్మన్ అర్జుమంద్ అలీంతో కలిసి ప్రారంభం చేశారు. రెండు రోజులు పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలకు జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన 700 ప్రదర్శలు రావడం అభినందనీయం అన్నారు.

సైన్స్ ప్రాదాన్యత ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని సూచించారు. ప్రదర్శలో విద్యార్థులకు ప్రభుత్వ పరంగ అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రస్థాయికి పలు ప్రదర్శనలు ఎంపిక కావాలి ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంసృతిక కార్యాక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పదర్శలు తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాద్యాయ సంఘాల నేతలు విద్యార్థులు పాల్గొన్నారు.