calender_icon.png 11 January, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్

02-08-2024 12:05:00 AM

జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

కామారెడ్డి, ఆగస్టు 1(విజయక్రాంతి): నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో హాజరు పట్టికను పరిశీలించారు. 27 జూలై నుంచి గురువారం వరకు విధులకు హాజరుకాని జూనియర్ అసిస్టెంట్ సుభాష్‌ను సస్పెండ్ చేశారు. రెగ్యులర్‌గా విధులకు హాజరుకాని ల్యాబ్ టెక్నిషియన్ నవ్యశ్రీని సంజాయిషి కోరారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఆయనవెంట జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, బాన్సువాడ ఆర్డీవో రమేష్ రాథోడ్ తదితరులు ఉన్నారు. అలాగే నిజాంసాగర్ ప్రభుత్వ పాఠశాల, అమ్మ ఆదర్శ పాఠశాలలను కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టును పరీశీలించారు. లింగంపేట మండల కేంద్రంలో నాగన్నబావిని సందర్శించారు.