22-04-2025 10:03:08 PM
కారుణ్య నియామక పత్రాలు అందజేసిన కలెక్టర్...
కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): విధుల నిర్వహణలో ప్రజల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) అన్నారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో విధులు నిర్వహిస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... నేటి నుండి మీరు ప్రభుత్వంలో భాగస్వాములని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని, సేవల్లో ప్రజల మన్ననలు పొందాలని, అదే ఉద్యోగి జీవితానికి ఆశీర్వాదమని అన్నారు. నియామక పత్రాలు తీసుకున్న వారిలో ఎం. రమేష్ ను మహాదేవపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంకు, డి. శ్రీవాణి చిట్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంకు కేటాయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎల్. విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.