calender_icon.png 1 February, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీ.హెచ్.సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

31-01-2025 09:22:36 PM

సుద్దపల్లి రెసిడెన్షియల్ స్కూల్, సుద్దులం జెడ్పీ హైస్కూల్ సందర్శన

నిజామాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. శుక్రవారం ఆయన జక్రాన్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. పీహెచ్సిలోని ఇన్ పేషంట్ వార్డ్, ల్యాబ్, టీకాలు ఇచ్చే గది, ఔషధాలను నిలువ ఉంచిన డ్రగ్ స్టోర్ తదితర విభాగాలను పరిశీలించారు.

సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసి, అందుబాటులో లేని వారి గురించి ఆరా తీశారు. వైద్య సేవల కోసం పీహెచ్సికి వచ్చిన రోగులను పలుకరించి, వారికి అందుతున్న వైద్య సేవల తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య పరికరాలను పరిశీలించి, సీబీపీ మెషిన్ వినియోగంలో ఉందా అని సిబ్బందిని ఆరా తీశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, కాలం చెల్లిన ఔషధాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వాటి స్థానంలో కొత్త స్టాక్ ను వినియోగించాలని కలెక్టర్ సూచించారు.