యాదాద్రి భువనగిరి, జూలై 5 (విజయక్రాంతి): గురుకుల పాఠశాలల నిర్వహణ, విద్యా బోధన, భోజనం తదితర వసతులను పరిశీలించడానికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే శుక్రవారం రామన్నపేట మండలంలోని జనంపల్లి బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఎలా చదువుతున్నారు, ఉపాధ్యాయులు ఎలా బోధిస్తు న్నారు, భోజనం ఎలా ఉందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ వంట గది, స్టోర్ రూమ్, డార్మిటరీ హాల్, వాష్ రూమ్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజా, మండల పంచాయతీ అధికారి అంజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, ఖదీర్ పాల్గొన్నారు.