బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని వంద పడకల ప్రభుత్వాసుపత్రిని మంగళవారం జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ సందర్శించారు. ఆసుపత్రిలోని మహిళల, పురుషుల వార్డులను ఆయన పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యం అందేలా చూడాలని వైద్యులను కలెక్టర్ దీపక్ కుమార్ ఆదేశించారు.