కోనరావుపేట, జనవరి 23: ఓ సామాన్యుడు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్ ఏళ్లుగా కబ్జా లో ఉన్న కాల్వ ను విడిపించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన పుట్ట నర్శయ్య అదే గ్రామనికి చెందిన ఉప్పుల దేవయ్య పల్లిమక్త ఊర చెరువు మత్తడి నుంచి దూకిన నీరు వెళ్లే కాల్వ ను ఏళ్ల గా కబ్జా చేసుకున్నాడు. నీరు వెళ్లే దారి లేక నీరంతా తమ పంట పోలాల్లో చేరి నష్టం చేస్తుంది.
ప్రజావాణి లో నర్శయ్య ఇచ్చిన ఫిర్యాదు తో స్పందించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వెంటనే ఇరిగేషన్ ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకొని కబ్జాలో ఉన్న కాలువను జెసిబి సహాయంతో రెండు రోజులు కష్టపడి కంచె ను తొలగించి, నీరు సక్రమంగా వెళ్లే దారి చేశారు. ఒక సామాన్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొన్నేళ్లుగా ఉన్న కాలువ కబ్జాదారుని నుంచి విడిపించిన జిల్లా కలెక్టర్ కు రైతులు,స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.