calender_icon.png 5 February, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విచారణకు ఆదేశించిన కలెక్టర్

05-02-2025 01:02:32 AM

*‘లిఖితపూర్వకంగా దోపిడీ’ కథనానికి స్పందించిన కలెక్టర్ విజయేందిర 

*-నేడు కొనుగోలుదారులు, కమిషన్ ఏజెంట్లతో సమావేశం 

*- కమిషన్ ఏజెంట్‌కు నోటీసులు జారీ చేశాం: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి బాలమణి 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని పల్లి రైతులకు విధించవలసిన ఖర్చు వివరాలను వసూలు చేయడంతో పాటు అప్పుడే అందిస్తున్న డబ్బులకు సంబంధించి రూ 1:50 అదనంగా వసూలు చేస్తున్నారని విజయ్ క్రాంతి దినపత్రిక నందు సోమవారం లిఖితపూర్వకంగా దోపిడి అనే కథనం ప్రచురితమైంది.

ఈ విషయంపై జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి స్పందించారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సంబంధిత వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి బాలమని సంబంధిత  కమిషన్ ఏజెంట్ కు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

ఈ విషయంపై కమిషన్ ఏజెంట్లతోపాటు కొనుగోళ్లు దారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి నియమ నిబంధనలు పాటించాలని ఆదేశించినట్లు తెలిపారు. రైతుల నుంచి అదనంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి బాలమని తెలిపారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి సమక్షంలో సమావేశం నిర్వహించినట్లు ఆమె తెలియజేశారు.