16-04-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ ఏప్రిల్ 15 (విజయ క్రాంతి) : ఉదండాపూర్ ముప్పు నిర్వాసితులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంకల్పంతో వేసవి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మూడు గంటల పాటు కాలినడకన ఆయా ప్రాంతాలను పరిశీలించారు.
మంగళవారం జడ్చర్ల మండలం దేవుని గుట్ట తండా వద్ద రేగడి పట్టి తండా,చిన్న గుట్ట తండా ,వల్లూరు, ఉదండ పూర్, తుమ్మల కుంట తండా,ఒంటి గుడిసె తండా ముంపు గ్రామాల నిర్వాసితులకు లోకేషన్ 1,2 ప్రాంతాల్లో చేపట్టిన పనులను రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు,అర్.డి. ఓ,ఇంజినీరింగ్ అధికారులు,కాంట్రాక్టర్ లతో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చారు.
పనుల్లో నిర్లక్ష్యం ఉండకూడదని వేగవంతంగా జరగాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు,స్పెషల్ కలెక్టర్ మధుసూదన్,అర్.డి. ఓ.నవీన్,ఇరిగేషన్ ఎస్. ఈ.చక్ర ధరం,మిషన్ భగీరథ ఎస్. ఈ.జగన్మోన్,సర్వే లాండ్ రికారడ్స్ ఏ.డి.కిషన్ రావు,ఇరిగేషన్ ఈ ఈ లు జె.రమేష్,ఉదయ్ కుమార్,మిషన్ భగీరథ ఈ ఈ.పుల్లారావు.,మౌలిక విధ్య సదుపాయాల సంస్థ ఈ ఈ రాం చందర్,జడ్చర్ల తహశీల్దార్ నర్సింగ రావు,డి.ఈ.లు, ఏ.ఈ.లు తదితరులు ఉన్నారు.