- ఐదుగురు చిన్నారులకు గాయాలు
- చిన్నారులను పరామర్శించిన సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు
నారాయణఖేడ్, జనవరి 24: అంగన్వాడి భవనం పెచ్చలూడి అయిదుగురు చిన్నారులకు తీవ్ర గాయాలైనాయి. శుక్రవారం నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఉన్న అంగన్వాడి భవనంలో పై పెచ్చులూడి చిన్నారులపై పడడంతో ఐదుగురి చిన్నారులకు గాయాలైనాయి.
దీంతో స్థానిక అంగన్వాడి నిర్వాహకులు 108 అంబులెన్స్ కు ఫోన్ లో సమాచారం అందించగా చిన్నారులను చికిత్స నిమిత్తం నారాయణ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. గాయాలు అయినవాళ్లు అభిలాష్, మౌనిక, హారిక, అంకితలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానిక వైద్యశాలలో చిన్నారులను పరామర్శించారు.
ఎవరికి పెద్ద గాయాలు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అన్నారు. చిన్నారులకు మెరుగైన చికిత్సను అందించాలని స్థానిక వైద్యాధికారి రమేష్ ను ఆదేశించారు. చిన్నారులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మాట్లాడారు. సిడిపిఓ సుజాత స్థానిక నాయకులు ఉన్నారు.
చిన్నారులకు పరామర్శ..
అంగన్వాడి భవనం పైకప్పు పెచ్చలూడి చిన్నారులకు గాయాలైన సమాచారాన్ని తెలుసుకున్న కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ప్రమర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా అధికారులు వసంతకుమారి తోపాటు అధికారులు ఉన్నారు.