calender_icon.png 22 November, 2024 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14 మంది ప్రాణాలు తీసిన పైసా

22-11-2024 12:38:55 AM

  1. సైనైడ్ ఇచ్చి చంపిన మహిళ
  2. నిందితురాలికి మరణశిక్ష విధించిన థాయ్‌లాండ్ కోర్టు

న్యూఢిల్లీ, నవంబర్ 21: జల్సాలకు బానిసైన ఓ మహిళ స్నేహితుల వద్ద దొరికినకా డికి అప్పులు చేసి.. డబ్బులు తిరిగివ్వమని అడిగినవారిని సైనైడ్ (విష పదార్థం)  ఇచ్చి దారుణంగా హతమార్చింది. నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా విచారణ అనంతరం ఆమెకు థాయ్ లాండ్ కోర్టు మరణశిక్ష విధించింది.

జూదానికి బానిసైన రంగ్‌సివతాపర్న్  స్నేహితుల వద్ద తరుచూ అప్పులు చేసేది. తర్వాత డబ్బులు తిరిగివ్వమని ఎవరైనా అడిగితే అనుమానం రాకుండా వారికి ఆహారం లేదా డ్రింక్స్‌లో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేసే ది. అనంతరం మృతుల ఇళ్లలో ఉన్న నగలు, నగదు దోచుకొని పరారయ్యేది. కొన్నేళ్లపా టు ఆమె ఈ దారుణచర్యకు పాల్పడింది. 

నిందితురాలిని పట్టించిన బ్యాంకాక్ ట్రిప్

ఈ క్రమంలో సారరట్‌తో కలిసి ఓ కార్యక్రమానికి బ్యాంకాక్ వెళ్లిన స్నేహితురాలు సిరపర్న్ ఖన్వాంగ్ మరణంతో అనుమానం వచ్చిన పోలీసులు కూపీ లాగడంతో ఈ సీరియల్ కిల్లింగ్స్ వ్యవహారం బయటపడింది. గతేడాది ఏప్రిల్‌లో బ్యాంకాక్‌లో జరిగిన ఓ మతపరమైన ఈవెంట్‌లో ఖన్వాంగ్, రంగ్‌సివతాపర్న్ పాల్గొన్నారు.

అక్కడ ఆహారం తిన్న వెంటనే ఖన్వాంగ్ ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందింది. ఆమె మరణంపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ చేపట్టగా.. ఈవెంట్ అనంతరం ఖన్వాంగ్‌కు సంబంధించిన వస్తువులు కన్పించకుండా పోయినట్లు గుర్తించారు.

ఈవెంట్‌లో ఖన్వాంగ్‌తో కలిసి పాల్గొన్న రంగ్‌సివతాపర్న్.. ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ ఎలాంటి సహాయం చేయకుండా అక్కడి నుంచి జారుకుందని తెలిసింది. వీటి ఆధారంగా రంగ్‌సివతాపర్న్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, వ్యవహారం బయటపడింది. పూర్తి వాదనలు విన్న థాయ్ న్యాయస్థానం.. నిందితురాలు నిందితురాలకి మరణశిక్ష విధించింది.