calender_icon.png 15 November, 2024 | 10:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో కూటమిని గెలిపించాలి

11-11-2024 12:57:34 AM

జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాం తి): జార్ఖండ్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని, తద్వారా రాష్ట్రాన్ని అదానీ, అంబానీ వంటి క్యాపిటలిస్ట్‌ల నుంచి విముక్తి కల్పించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయ న జార్ఖండ్‌లోని రాంఘర్ నియోజకవర్గం లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్‌లెవల్ మీటింగ్‌లో మాట్లాడారు. ఏఐసీసీ అగ్రనేత మల్లికార్జున ఖర్గే కన్యాకుమారి నుంచి కశ్మీర్  వరకు ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టి దేశంలోని ప్రజస్వామిక శక్తులన్నింటినీ ఏకం చేశారని కొనియాడారు.

యాత్ర ద్వారా రాహుల్‌గాంధీ దేశ ప్రజలకు రెండు సంకేతాలు ఇచ్చారన్నారు. ఒకటి విద్వేశాలు రగిలించే వారి చేతిలో దేశాన్ని పెట్టొద్దన్నా రు. రెండోది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రేమ అనే దుకాణం తెరిచి అన్ని జాతులు, మతాలకు సమాన అవకాశాలు ఇస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. ఆదాని, అంబానీ వంటి క్యాపిటలిస్టుల నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నా రు.

దేశ సంపద జనాభా నిష్పత్తికి అనుగుణంగా పంపిణీ కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమన్నారు. జార్ఖండ్‌ను పెట్టుబడిదారుల చేతిలో పెట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని, ఆ ప్రయత్నాలను కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కూట మి ఇస్తున్న హామీలు, మేనిఫెస్టోను బలంగా ఓటర్లలోకి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో రాంఘర్ ఎమ్మెల్యే అభ్యర్థి మమతాదేవి పాల్గొన్నారు.