ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో దళితబంధు రూ.12 లక్షలకు పెంచుతామని మాట తప్పిన సీఎం రేవంత్ దళిత ద్రోహిగా మిగిలిపోతాడని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో సోమవా రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దళిత బంధు ఇవ్వాలని కలెక్టర్లు, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందిం చని సర్కారు.. కొందరిని తన ఇంటి వద్ద ధర్నాకు ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్ర భుత్వం రాగానే దళితబంధు అకౌంట్లను ఫ్రీజ్ చేశారని ఆరోపించారు. తన ప్రాణం పోయినా సరే.. దళితబంధు ఇచ్చేదాక పోరాడతానని స్పష్టం చేశారు.