calender_icon.png 27 September, 2024 | 4:32 AM

నేతన్నలపై పగబట్టిన సీఎం

27-09-2024 01:19:51 AM

  1. బతుకమ్మ చీరల నిలిపివేతతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 26(విజయక్రాంతి): రాజకీయంగా తన మీద కోపంతోనే రాజన్న సిరిసిల్ల ప్రజలు, నేతన్నల మీద సీఎం రేవంత్‌రెడ్డి పగబట్టి కక్ష తీర్చుకుంటున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం కేటీఆర్ పర్యటించారు. బోయిన్‌పల్లి మండలం కొదురుపాక తన అమ్మమ్మ, తాత(కేశవరావు జ్ఞాపకార్థం నిర్మించిన స్కూల్ భవనాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు.

అనంతరం సిరిసిల్ల బీఆర్‌ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బతుకమ్మ చీరల ఆర్డర్లను బంద్ చేయడంతో సిరిసిల్లలోని వేల నేతన్నల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దివాళకోరు నిర్ణయంతో రాష్ర్టంలోని కోటి మందికి పైగా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు బంద్ అయ్యాయని పేర్కొన్నారు. గత తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.3,312 కోట్ల ఆర్డర్లు సిరిసిల్లకు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆత్మహత్యలు బంద్ అయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ నేతలు చేనేత కార్మికులకు 365 రోజులు ఉపాధి కల్పిస్తామని చెప్పి బతుకమ్మ ఆర్డర్లను బంద్ చేశారని మండిపడ్డారు. 

ఫార్మా సిటీ రద్దు వెనుక వేల కోట్ల కుంభకోణం 

ఫార్మా సిటీని రద్దు వెనుక వేలకోట్ల కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు చాలా మంది నాయకులు ఫార్మాసిటీని రద్దు చేసి, ఆ భూములను రెతులకు ఇస్తామని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అయితే ఫార్మా సిటీ ఉన్నదా? పోయిందా? అని కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయిస్తే కాంగ్రెస్ ప్రభుతం ఫార్మా సిటీ రద్దు కాలేదని పిటిషన్ వేసిందని చెప్పారు. తమ హయాంలో రైతులను ఒప్పించి, సేకరించిన 14 వేల ఎకరాల్లో రూ.64 వేల కోట్ల పెట్టుబడులతో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఫార్మాసిటీని ప్రతిపాదించామని కేటీఆర్ తెలిపారు. ఇవాళ ఆ భూములను రియల్ ఎస్టేట్ దందా కోసం, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ కోసమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లించి రూ.వేల కోట్లు నొక్కేయాలనే ఆలోచన చేస్తున్నదని ఆరోపించారు. భూ దందాలను తప్పకుండా బయటపెడుతామని కేటీఆర్ అన్నారు. ఫార్మా సిటీని కొనసాగిస్తే 14 వేల ఎకరాల్లో ఉండాలని, రద్దు చేస్తే ఆ భూమి రైతులకు తిరిగి ఇవాలని డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్‌కు వంతపాడితే వదలం

కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు వంతపాడే అధికారులను వదలబోమని కేటీఆర్ హెచ్చరించారు. ఇక్కడున్న కాంగ్రెస్ నేతకు అధికారులు వంతపాడుతూ ఆగం అవుతున్నారని విమర్శించారు. చట్టం ప్రకారం పనిచేయాలని సూచించారు. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే మరో నాలుగేండ్లలో మళ్లీ కేసీఆర్ తిరిగి వస్తారని, మీ సంగతి తప్పకుండా చూస్తామని కేటీఆర్  హెచ్చరించారు. బీఆర్‌ఎస్ హయాం లో 54 రేషన్ దుకాణాలకు 480 మంది దరఖాస్తు చేసుకుంటే.. ప్రస్తు తం వాటి కేటాయింపులో పారదరకత పాటించకుండా లక్షల రూపా యాలకు డీలర్ పోస్టులను అమ్ముకున్నారని కాంగ్రెస్ నాయకులే ఆరోపి స్తున్నారని చెప్పారు. రాతపరీక్షలో మెరిట్ లిస్ట్‌ను బయటపెట్టాలని కోరా రు. రేషన్ దుకాణాల బాధితుల తరఫున హైకోర్టును ఆశ్రయిస్తామని కేటీ ఆర్ స్పష్టం చేశారు. 

నీపై కోపంతో పథకాలు ఆపలేదు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్

“నీపై కోపంతో కాంగ్రెస్ ఏ పథకాలు ఆపలేదు. సిరిసిల్ల జిల్లాలో జరిగిన అవకతవకలను తరలోనే బయటకు తీస్తాం” అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బతుకమ్మ చీరలకు రూ.197 కోట్లు బకాయిలు పెట్టి, ఇప్పుడు రాజకీయం చేయడం తగదన్నారు. సిరిసిల్లలో కాటన్, పాలిస్టర్ ఉత్పత్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేటీఆర్ బుద్ధి మార్చుకోకపోవడంతోనే ప్రజలు పక్కన పెట్టారన్నారు. మొసలి కన్నీరును ప్రజలు గమనిస్తున్నారని, బీఆర్‌ఎస్ పార్టీలో మిగిలేది నలుగురేనని వారికి మరో పదేళ్ల దాకా అధికారం రాదని ఆది శ్రీనివాస్ విమర్శించారు.