calender_icon.png 13 January, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను నట్టేట ముంచిన సీఎం

13-01-2025 12:43:04 AM

  • పరిపాలనలో విఫలమై హింసను ప్రోత్సహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట, జనవరి 12 (విజయక్రాంతి) :  కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని నట్టేట ముం చి, సిగ్గులేకుండా సంబరాలు చేయమం టున్నారనీ మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. ఆ దివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యా లయంలో ఆయన విలేకరుల సమావేశం లో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ నాయకు లు గ్రామాలకు వస్తే రైతులు నిలదీస్తు న్నారనీ, సిఎం రేవంత్ రెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీలు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయకుండా గ్రామా లకు ఎలా వస్తారంటూ నిల దీస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇ చ్చిన హామీలను అమ లు చేయడం లేదన డంలో తాను బహి రంగ చర్చకు సిద్ధమ న్నారు. ఎకరానికి రూ.9 వేలు ఏటా రైతు లను ముంచుతున్నదనీ, వానాకాలం గుండు సున్నా ఇచ్చారని చెప్పారు.

కాంగ్రెస్ నాయకులు గ్రామాలలోకి వస్తె ఎకరాలు రూ.15 వెలు ఇవ్వాల్సిందేనని నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉంటే కేవలం పది లక్షల మందికి మాత్రమే ఉపాధి కల్పించారని చెప్పారు. సిఎం రేవంత్ రెడ్డి బుకాయింపుల కు మాని ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయాల ని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించకుండా డైవ ర్షన్ పాలిటిక్స్ చేస్తు న్నా రని, సంక్షేమంలో విఫ లమైన సీఎం రేవంత్ రెడ్డి హింసాత్మక చర్య లకు పాల్పడుతున్నా రని చెప్పారు. యాదా ద్రిలో దాడులు చేస్తున్న వారిని పోలీసులే ప్రోత్స హిస్తున్నట్లు కనిపిస్తుం దన్నారు. హోం మంత్రి, ముఖ్య మంత్రిగా కొనసా గుతున్న రేవంత్ రెడ్డి హింసాత్మక సంఘటనలను ప్రోత్సహిస్తే పెట్టుబడులు వస్తాయా ? ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, సినిమా హీరో అల్లు అర్జున్ ఇళ్ళమీద దాడులు, బిఆర్ ఎస్, బిజెపి కార్యాలయాల పైనా కాంగ్రెస్ గుండాలతో  దాడులు చేపి స్తున్నారని ఆరోపించారు.

అందుకు ముఖ్య మంత్రి మౌనమే నిదర్శనం అన్నారు. అనంతరం సిద్దిపేట పట్టణంలో పలు వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు.

కల్యాణ లక్ష్మి, తులం బంగారం, పాత పథకాలు అమలు చేయకపోగా కొత్త పథకాలు ప్రవేశపెట్టడం లేదని విమర్శించారు. ముగ్గుల పోటీలలో ప్రతిభ చాటిన మహిళ లకు బహుమతులు అందజేశారు. అనంత రం చిన్నకోడూరు టిఆర్‌ఎస్ పార్టీ యువ కులతో సమావేశం అయ్యారు.  ఈ కార్య క్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.