calender_icon.png 24 February, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సభను విజయవంతం చేయాలి

23-02-2025 07:33:45 PM

మందమర్రి (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 24న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న మంచిర్యాల సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉపేందర్ గౌడ్ సీనియర్ నాయకులు సుదర్శన్ కోరారు. ఆదివారం గారు విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాలలో నిర్వహిస్తున్న సభకు సీఎంతో పాటు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సభకు పట్టణంలోని పట్టభద్రులు, కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.