calender_icon.png 16 January, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం నిరుద్యోగులను పిలిచి మాట్లాడాలి

06-07-2024 11:49:40 PM

నిరుద్యోగ దీక్షలో బక్క జడ్సన్  

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి) : సీఎం రేవంత్‌రెడ్డి ఈగో, అహంకారంతో వ్యవహరిస్తున్నారని, నిరుద్యోగులను పిలిచి ఎందుకు మాట్లాడరని ఏపీవీసీసీ మాజీ చైర్మన్, తెలంగాణ వనరుల రక్షణ సేన వ్యవస్థాపకులు బక్క జడ్సన్ ప్రశ్నించారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గ్రూప్ 2, 3 పరీక్షలను వాయిదా వేసి పోస్టులను పెంచాలని జడ్సన్ చేస్తున్న దీక్ష శనివారం ఐదో రోజుకు చేరింది. ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులతో సీఎం చర్చిస్తే అధికారుల కన్నా మంచి సలహాలు ఇస్తారని, నిరుద్యోగుల సమస్యలపై సీఎం ప్రకటన మరింత ఆగ్రహం తెప్పించే విధంగా ఉందన్నారు. గ్రూప్ 1:100 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని, మెగా డీఎస్సీ నిర్వహించాలని, గ్రూప్స్ పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కలుగజేసుకోవాలని గవర్నర్ రాధాకృష్ణన్‌కు లేఖ రాసినట్లు చెప్పారు.