మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి) : మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేయలేదనడం అవగాహన రాహిత్యమేనని ఎద్దేవా చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు.
మంచినీటి ఎద్దడి ఎదుర్కొన్న మహబూబ్‌నగర్‌లో ఇంటింటికీ నల్లా నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ ప్రభుత్వం ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నదని మండిపడ్డారు. జిల్లాకు మరిన్ని కంపెనీలను తీసుకురావాలని సీఎంకు సూచించారు. మహబూబ్‌నగర్ అంధుల కాలనీలో 75 ఇండ్లు కూలగొట్టారని, వారిని ఆదుకున్నందుకు తమ సోదరుడిని జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం వచ్చి అబద్ధాలు చెబుతున్నారని ప్రజలకు అర్థమైందన్నారు. అబద్ధాల పునాదులతో రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టారని విమర్శించారు. వడ్ల కొనుగోలుపై సీఎం దృష్టి సారించాలని సూచించారు.