calender_icon.png 10 October, 2024 | 4:57 AM

బలవంతంగా సీఎం నివాసం ఖాళీ

10-10-2024 01:03:21 AM

ఆప్, ఎల్జీ మధ్య మరో వివాదం

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసాన్ని బలవంతంగా ఖాళీ చేయించారని సీఎంవో వెల్లడించింది. ఆతిశీ సంబంధించిన వస్తువులను బయటికి తీసుకెళ్లిపోయారని తెలిపింది. ఓ బీజేపీ నేతకు ఆ నివాసాన్ని కేటాయించాలనే ఉద్దేశంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారని ఆరోపించింది. కాగా దీనిపై ఎల్జీ కార్యాలయం స్పందించలేదు.

దీనిపై స్పందించిన ఆప్.. ఢిల్లీలో బీజేపీ అధికారానికి దూరమైందని, ప్రజల మద్దతు కూడగట్టలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ విమర్శలు చేశారు. ఇటీవల సీఎం నివాసం నుంచి పబ్లిక్ వర్క్స్ శాఖ బృందాలు సీఎంకు చెందిన సామగ్రిని రిక్షాలు, ట్రక్కుల్లో తరలించడంతో ఈ వివాదం మొదలైంది.