calender_icon.png 31 October, 2024 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం అదే చేస్తున్నరు

12-07-2024 01:52:06 AM

  1. సమైక్య పాలనలో ఆరోపణలు ఎదుర్కొన్న కాంట్రాక్టర్లకే మరలా పెద్దపీట
  2. బీజెపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్,  జూలై 11 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం జీవోలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టకుండా చీకటి ఒప్పందాలతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రహస్య జీవోలతో సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మేఘా కృష్ణారెడ్డికి రూ.1100 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ర్ట ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ర్ట ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకొని జీవోలు తెచ్చి బలవంతపు వసూళ్లు చేస్తుందని ఆరోపణలు గుప్పించారు.

మేఘా కృష్ణారెడ్డికి రూ. 11 వందల కోట్ల ప్రా జెక్ట్ ఇచ్చారని.. ఎక్సుజ్ కుంభకోణంలో ఉన్న రేవంత్ బామ్మర్ది సృజన్‌కు చెం దిన శోధ కంపెనీకి రూ. 400 వందల కోట్ల కాంట్రాక్టర్ ఇచ్చారని తెలిపారు. రూ. 600 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్ట్‌ను వెయ్యి కోట్లకు ఇచ్చారని అన్నారు. 30 నుంచి 35 శాతం తక్కువకు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నా పట్టించుకోవట్లేదన్నారు. రూ.1200 కోట్ల కుంభకోణం జరిగిందని తెలిపారు.మేఘా కృష్ణారెడ్డి మీద కాళేశ్వరం ఎంక్వురై జరుగుతున్నా కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మేఘా కృష్ణారెడ్డితో తెలంగాణ సొమ్ము కక్కిస్తాను అని చెప్పిన రేవంత్ రెడ్డి మళ్లీ ఆయనకే కాంట్రాక్ట్ కట్టబెట్టడం వెనకున్న మతలబేంటని? అను మానం వ్యక్తం చేశారు.