బీఆర్‌ఎస్ నేత రాకేష్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): నిరుద్యోగుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి పరిపక్వత లేకుం డా మాట్లాడుతున్నాడని బీఆర్‌ఎస్ నేత రాకేష్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగుల ఆత్మస్థుర్యైన్ని దెబ్బతీస్తున్నారని, మోతీలాల్‌నాయక్, బక్క జడ్సన్, అశోక్ సార్ అమరణ దీక్షలు చేస్తే వాళ్లు ఏం పరీక్షలు రాశారని సీఎం హోదాలో వ్యాఖ్యలు చేయ డం సరికాదన్నారు. ఇదే అంశంపై 2023 వరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేశారని, అప్పుడు ఏ పరీక్ష రాశారని ఉద్యమించారో చెప్పాలన్నారు.
నిరుద్యోగుల గురిం చి మాట్లాడాలంటే పరీక్షలు రాసి ఉండాలి.. కార్మికుల సమ స్యలు ప్రస్తావించాలంటే కార్మికుడై ఉండాలనే రూల్ ఎక్కడుందో సీఎం చెప్పా లని డిమాండ్ చేశారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు తెగిం పు, తెగువ ఉంటాయని, అణచివే యాలని చూస్తే అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో నిరుద్యోగులు కాంగ్రెస్ కోసం ఊరూరా తిరిగి ప్రచారం చేసి అధికారంలోకి తీసుకొస్తే నేడు వారి ఉద్యమం వెనక బీఆర్‌ఎస్ ఉందని ఎగతాళిగా మాట్లాడటం మానుకోవాలన్నారు.