25-02-2025 02:41:06 AM
*కార్మికుల ప్రాణాల కంటే ప్రచారమే ముఖ్యమా?
*ప్రభుత్వ వైఫల్యం వల్లే టన్నెల్ కూలింది
*మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 24(విజయక్రాంతి): కార్మికుల ప్రాణాల కంటే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమే సీఎం రేవంత్‌రెడ్డికి ము ఖ్యమైందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టన్నెల్‌లో చిక్కుకున్న 8మంది కార్మికులను కాపాడటంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని ఆరో పించారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని, తెలంగాణ పునర్నిర్మాణంలో బయటి రాష్ట్రాల కార్మికుల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు.
రాష్ట్ర మంత్రులకు ఫోటోలపై ఉన్న శ్రద్ధ ప్రాణాలను కాపాడటంలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఈ ఘటనపై రాజకీయాలు చేయడం లేదని, సీఎం రేవంత్‌రెడ్డే ఓట్ల కోసం బయలుదేరి రాజకీయం చేస్తున్నారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి మండలి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన దాఖలాలు లేవన్నారు. టన్నెల్ ప్రమాదంపై ప్రధాని మోదీతో తాను మాట్లాడినట్టు సీఎం చెబుతున్నారని, కానీ రక్షణ చర్యల గురించి ఏం అడిగారో ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు.
టన్నెల్ తవ్వేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీపేజీ ఆగకపోవడం వల్లే గతంలో ఎస్‌ఎల్‌బీసీ పనులు ముందుకు సాగలేదని చెప్పుకొచ్చారు. నల్లగొండ ప్రజలకు కృష్ణా నీళ్లు రా చేయాలని గత సమైక్య పాలకులు ఎస్‌ఎస్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టారన్నారు.
నల్లగొండ కాంగ్రెస్ నేతలు నోరు మూసుకోవడం వల్లే ఎస్‌ఎల్‌బీసీని మరోసారి తెరపైకి తెచ్చారన్నారు. జాతీయ, అం నిపుణులతో మాట్లాడి కార్మికుల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ , మాజీ ఎమ్మెల్యేలు ఎన్ భాస్కర్‌రావు ,కే భూపాల్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ జీ దేవీప్రసాద్ పాల్గొన్నారు.