డివైఎఫ్ఐ జిల్లా సహాయాక కార్యదర్శి కట్ట లింగస్వామి
మునుగోడు (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నేడు ప్రభుత్వ విద్యాసంస్థల బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని, డివైఎఫ్ఐ జిల్లా సహాయాక కార్యదర్శి కట్ట లింగస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా, గురుకుల పాఠశాలలో నాయనమైన భోజనం అందించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకానికి అధిక నిధులు కేటాయించి నాణ్యమైన భోజనం అందించాలని, వంట సిబ్బందికి పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాలక ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, నేటి బందుకు మండల విద్యాధికారులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పరుసగొని లింగస్వామి, డివైఎఫ్ఐ మాజీ నాయకులు పగిళ్ల మధు పాల్గొన్నారు.