24-02-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): తాగర అన్న.. తాగే ఉగారా అన్నా.. ప్రభుత్వ గల పెట్టను నింపన్నా.. నీ కుటుంబాన్ని ఏమైతే మాకేందన్నా.. అన్నట్ల ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం విక్రయాల జోరు. గుడి బడి తేడా లేకుండా విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పరచుకొని ఉదయం నాలుగు గంటల నుంచి గ్లాసుల గలగల చోటు చేసుకుంటుంది.
ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మొదలుకొని పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ మండలం వరకు ఇదే తంతు. ఒకవైపు విచ్చలవిడిగా మద్యం దుకాణాల్లో, మరోవైపు సిండికేట్ దందా ప్రతి బాటిల్ కు రూ20 నుంచి రూ 50 అధిక ధరలకు విక్రయిస్తున్న నియంత్రించే నాధుడే లేకుండా పోయారు. కోరుకున్న బ్రాండ్ మద్యం షాపుల్లో దొరకకపోయినా బెల్ట్ షాపుల్లో మాత్రం తప్పక లభిస్తుంది.
అందుకు ప్రధాన కారణం ఎంఆర్పి ధర కన్నా ఎక్కువ విక్రయించే సౌలభ్యం బెల్టు షాపులకు ఉండటమే, తద్వారా మందుబాబుల జేబులకు చెల్లెలు పడుతున్నాయి. మద్యం ప్రియులకు అవసరమైన మాన్షన్ హౌస్, రాయల్ స్టాగ్, ఐబి హోటల్లో, కింగ్స్ ఫర్ నాకౌట్ బీర్లు అనుమతి పొందిన వైన్ షాపుల్లో దొరకవు, వందలాది బెల్ట్ షాపులో మాత్రం విచ్చలవిడిగా లభ్యమవుతాయి..
ఈ మద్యం మాఫియాను అరికట్టే నాధుడే కరువయ్యాడు. జిల్లాస్థాయి ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు, స్థానిక ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో తోలుతుంటారు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా 24 గంటలు 30 రోజులపాటు లిక్కర్ అవైలబుల్ అన్నట్టుగా ఉంది మద్యం దందా.
ఐటీడీఏ రోడ్డు లోని వైన్స్లో సిండికేట్ వ్యవస్థను ఏర్పరచుకొని మద్యం మఫియా దండుకుంటున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో పరిశీలిస్తే తెలతెలవారంగానే బారం రెస్టారెంట్ల్లో మద్యం విక్రయాలు మొదలవుతుంటాయి.
ఎక్సైజ్ అధికారుల కనుసన్నాల్లోనే మద్యం వికలా నడుస్తున్నట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి. వాస్తవంగా ఎక్సైజ్ అధికారులు మద్యం విక్రయాలను అరికట్టి బెల్ట్ షాపులను నియంత్రించి, అధిక ధరల అదుపు చేయాలని నిబంధనలో ఉన్న మద్యం మాఫియా చెల్లించే ముడుపులకు తలకి అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని తెలుస్తోంది.
దేనికి తోడు అశ్వరావుపేట దమ్మపేట చండ్రుగొండ ఏరియాలలో ఇతర జిల్లాల మధ్య కూడా విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పాల్వంచ పట్టణ పరిధిలోని వేటచెరువు గ్రామంలో కల్తీ మద్యం తాగే ఒక వ్యక్తి మృతి చెందిన విషయం విధితమే, మరో వ్యక్తి మద్యం సేవించి ఆసుపత్రి పాలైన సంఘటన తెలిసిందే.
ఉదయం వేళల్లో మద్యం సేవించడం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని పదుల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు బార్లు రెస్టారెంట్ లో సమయపాలన పాటించేలా చూడాలని, కల్తీ మద్యం విక్రయం పై నిగా ఉంచాలని, అధిక ధరలు నియంత్రించాలని మద్యం ప్రియులు డిమాండ్ చేస్తున్నారు.