విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ రూపొందించిన సరికొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా హీరో వెంకటేశ్ శనివారం మీడియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రశ్నావళిలో వెంకీ మామ చెప్పిన చిత్ర విశేషాలు, మిగతా సంగతుల సమాహారమిది..
‘సంక్రాంతికి వస్తున్నాం’ కోసం ఉత్సాహంగా ఉన్నట్టున్నారు?
నా కెరీర్ ఇది మరో సంక్రాంతి. ఒక పూర్తి వినోదభరితమైన చిత్రంతో రావడం చాలా ఆనందంగా ఉంది. లిటిల్ క్రైమ్ ఎలిమెంట్ న్యూ జానర్ కూడా ఉంది. సినిమా జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. నా కెరీర్లో సంక్రాంతికి వచ్చిన ఎక్కువ సినిమాలు చాలా బాగా ఆడాయి. ఈ సినిమా కూడా అద్భుతంగా ఆడుతుందనే నమ్మకం ఉంది.
ప్రమోషన్స్ చాలా ఎనర్జిటిక్‌గా చేయడానికి కారణం?
అది అనుకోకుండా అలా సహజంగా జరిగింది. మ్యూజిక్ చాలా నచ్చింది. నాకు డ్యాన్స్ చేయడం ఇష్టం. కొన్ని మ్యూజిక్ ట్యూన్స్ వినగానే క్రేజీగా అనిపించింది. డైరెక్టర్ అనిల్, ఇద్దరు హీరోయిన్స్.. లైవ్లీ టీమ్ కుదిరింది. ప్రచారంలో ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాం. ప్రమోషన్స్‌ను ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేయడం హ్యాపీగా ఉంది.
మీతో పాడించాలనే ఆలోచన ఎవరిది?
రాత్రి రెండు గంటలకు ఆ పాట విన్నప్పుడు తెలియకుండానే డ్యాన్స్ చేశాను. ఏదో క్రేజీ ఎనర్జీ ఆ సాంగ్‌లో ఉంది. సరదాగా నేనే పాడతా అని అన్నాను. ఇంగ్లీష్ వర్డ్స్ ఉండటంతో నాకు ఇంకా ఈజీ అయ్యింది (నవ్వుతూ).
కథ విన్నప్పుడు మిమ్మల్ని ఆకర్షించిన అంశమేంటి?
ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్.. ఈ లైనే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. మినిమం గ్యారెంటీ అని అక్కడే తెలిసిపోయింది. ఇందులో కామెడీ స్టుల్ కొంచెం భిన్నంగా ఉంటుంది. చాలా షటిల్‌గా కొత్తగా ట్రై చేశాం. ఫ్రెష్ సీన్స్ ఉంటాయి. అనిల్‌తో మంచి ర్యాపో కుదిరింది. తనతో మూవీస్ కంటిన్యూ చేయాలనుంది.
మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ గురించి..
ఇద్దరికీ చాలా మంచి పాత్రలు దక్కాయి. చక్కగా నటించారు. ఆ క్యారెక్టర్స్ వెరీ క్రేజీగా ఉంటాయి.
మీ ఎక్స్ కాప్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
చాలా సరదాగా అనిపించింది. ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ వచ్చి.. నా గురించే ఆలోచి స్తున్నావా? నేను వచ్చే లోపల నలుగురిని కన్నావ్.. అన్నప్పుడు చాలా హిలేరియస్‌గా అనిపించి ంది. అలాంటి సీన్స్ చేయడం చాలా ఎం జాయ్ చేశాను. ఇం దులో నాకు నలుగురు పిల్లలు. అం దులో ఒకడిని చాలా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది (నవ్వుతూ). క్లుమైక్స్‌లో చెప్పే డైలా గ్స్ చాలా క్రేజీ ఉంటాయి. వాటిని యూత్ చాలా ఇష్టపడతారు.
మీరు సెట్స్‌లో ఉంటే నిర్మాత సెట్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని దిల్ రాజు చెప్పారు.. అన్నీ మీరే జాగ్రత్తగా చూసుకుంటారట!
లేదండి.. నిర్మాతలు రావాలి (నవ్వుతూ). నాకు చిన్నప్పట్నుంచీ అలవాటు. ప్రతి సినిమా నా సొంత సినిమాగా చేస్తాను. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. సిన్సియర్‌గా పనిచేస్తాను. దిల్ రాజు ప్రొడక్షన్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నుంచి ట్రావెల్ అవుతున్నాను. వారితో జర్నీ చాలా కంఫర్ట్ బుల్గా ఉంటుంది. మేము చేసిన సినిమాన్నీ బాగా ఆడాయి. వారికి మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నాను.
ఈ సినిమాను 70 రోజుల్లోనే పూర్తి చేయడం ఎలా అనిపించింది?
సినిమాను ఫాస్ట్‌గా ఫినిష్ చేయడం హ్యాపీగా అనిపించింది. అనుకున్నదాని ప్రకారం అన్నీ అద్భుతంగా కుదిరాయి కాబట్టే సాధ్యమైంది.
ఈ సినిమా గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు?
వెరీ నైస్ ఫెస్టివల్ ఫిల్మ్‌తో వస్తున్నాం. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. క్ల్లుమాక్స్ చాలా సర్ప్రైజ్ చేస్తుంది. పిల్లలు, పెద్దలు, యూత్ అందరూ ఎంజాయ్ చేస్తారు.
హిట్స్, ఫ్లాప్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తాయా?
హానెస్ట్ అండ్ సిన్సియర్‌గా వర్క్ చేయడమే మన చేతిలో ఉంటుంది. హిట్స్, ఫ్లాప్స్ మన చేతిలో ఉండవు. మన కంట్రోల్లో లేని విషయాల గురించి నేను ఎక్కువ ఆలోచించను. మీ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి చాలా పాజిటివ్ పోస్టులు వస్తుంటాయి.. లైఫ్‌లో పాజిటివ్‌గా ఉండాలి. ఓవర్ థింకింగ్ అనవసరం. ఓ పాజిటివ్ థాట్‌తో రోజు మొదలుపెడితే జీవితం చాలా హాయిగా ఉంటుంది.
‘రానా నాయుడు 2’ ఎప్పుడు?
మార్చిలో రావచ్చు. డబ్బింగ్ అయ్యింది.
తర్వాతి సినిమాలు..
సురేశ్ ప్రొడక్షన్, సితార వంశీ, మై త్రీ, వైజయంతి మూవీస్‌లో కథలపై వర్క్ జరుగుతోంది. ఇంకా ఏదీ ఫైనలై జ్ కాలేదు.