* మాదిగ మేధావుల ఫోరం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో ఆమోదించిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును తక్షణమే జీవో రూపంలోకి తీసుకురావాలని మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే పరీక్షలు ముగిసి ఫలితాల విడుదలకు సిద్ధంగా ఉన్న గ్రూప్ గ్రూప్ తదితర ఉద్యోగాల భర్తీలో వర్గీకరణ అమలు చేయాలని ఫోరం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా గురువారం మాదిగ మేధావుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ రాజేందర్ అధ్యక్షతన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్‌ను నెరవేర్చి సీఎం రేవంత్‌రెడ్డి తన చిత్త శుద్దిని నిరూపించుకున్నందుకు ఫోరం కృతజ్ఞతలు తెలియజేసింది.
ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసీం, తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం మాట్లాడుతూ.. వర్గీకరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించిన నేపథ్యంలో 5 రోజుల్లో జీవో జారీ అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త జీవో ప్రకారమే ఉద్యోగాల భర్తీని చేపట్టాలని కోరారు.
వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన రోజైన ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ సాధన దినంగా ప్రకటించిడం హర్షనీయమన్నారు. ఈ సమావే శంలో డాక్టర్ ఆరేపల్లి రాజేందర్, ప్రొ. నతానియేల్, బంధు సొసైటీ వ్యవస్థాపకులు పల్లెల వీరస్వామి, డాక్టర్ ఉపేందర్ ఇనప, వేల్పుల కుమార్, డాక్టర్ మేడి శ్రీను, వెంకటేష్, డాక్టర్ మద్దిలేటి పాల్గొన్నారు.