18-03-2025 12:31:13 AM
మాదిగ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నవీన్‌రాజ్
ముషీరాబాద్, మార్చి 17:(విజయక్రాం తి):తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెం బ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుని ప్రవేశపెట్టాలని మాదిగ రాజ్యాధికార పోరా ట సమితి డిమాండ్ డిమాండ్ చేసింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాదిగలకి శుభవార్త కాంగ్రెస్ ప్రభుత్వం వినిపిస్తుందని తెలంగాణలో ఉన్న మాదిగలంతా లక్షల కళ్ళతో ఎదురుచూస్తున్నారని పేర్కొంది.
ఈ మేరకు సోమవారం భోలక్పూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు తిమ్మ న నవీన్ రాజ్, ఉపాధ్యక్షుడు ఎం కోటేశ్వరరావు, ఎంఎస్‌ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్య క్షుడు బి. ఉపేందర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలకు అనుకూలమని, మొదటి నుంచి ఈసారి కచ్చితంగా మాదిగలకి ఈ సమావేశాల్లోనే న్యాయం చేస్తారని మేము సంపూర్ణంగా ఈ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నామన్నారు.
ఎస్సీ వర్గీకరణ చట్టంతో పాటు వెంటనే రానున్న జాబ్ నోటిఫికేషన్ అమలు జరగాలని, గ్రూప్-1, గ్రూప్ -2, గ్రూప్ -3, ఉద్యోగాలలో ఈ నోటిఫికేషన్లలో మాదిగ న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మాదిగలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతమైన స్థాయి పదవులు లేవ ని ప్రభుత్వానికి గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లుని చట్టం చేస్తూనే త్వరలో మాదిగ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి మాదిగ ఉద్యమకారులకే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాదిగ రాజ్యాధికార పోరాట సమితి హైదరాబాద్ జిల్లా మెడికల్ ల్యాబ్ అధ్యక్షుడు డాక్టర్ శ్యామ్, యువసేన నాయకులు విజయ్ పాల్గొన్నారు.