calender_icon.png 25 January, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలి

24-01-2025 05:13:37 PM

ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు బిఎన్.రమేష్ కుమార్ మాదిగ...

ముషీరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని జాతీయ మాదిగ రాజకీయ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బిఎన్.రమేష్ కుమార్ మాదిగ కోరారు. ఈ మేరకు శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మందకృష్ణ ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7న ట్యాంక్ బండ్ పై తలపెట్టనున్న 'లక్ష డప్పులు-వేల గొంతుకలు' కార్యక్రమానికి మాదిగ రాజకీయ పోరాట సమితి, మహాజన పోరాట సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేతలు పి.సంపత్, గద్దల కుమార్, ఈరెల్లి శ్రీనివాస్, చిన్న అంజనీ, మల్లెపాక చంద్రమౌళి, ఆర్.బాగయ్య మాదిగ, చిట్యాల సాయన్న, రవి, మల్లికార్జున్, ప్రసాద్, అలివేలమ్మ, నేరెళ్ల కుశాల్ కుమార్, కట్కూరి శ్రీనివాస్, అనిల్ కుమార్, బి.నవీన్, సుంకశాల సంపత్ మాదిగ, అరుణ్ కుమార్ మాదిగ పాల్గొన్నారు.