హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 19 (విజయ క్రాంతి): విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో నేరాలను అరికట్టి శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీ స్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు మరింత మెరుపర్చేందుకు సీఏఆర్ (కార్) హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్న 573 ఏఆర్ కానిస్టేబళ్లను నగరంలోని వివిధ సివిల్ పోలీస్ స్టేషన్లకు అటాచ్ చేసిన సందర్భంగా ఆదివారం ఇంట్రాక్షన్ సెషన్‌లో సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ..
నగరంలోని పోలీస్ వ్యవస్థను మరింత ప్రక్షాళన చేసేందుకే 573 కానిస్టేబుళ్లను లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్‌తో పాటు వివిధ విభాగాలకు అటాచ్ చేసినట్టు తెలిపారు.పని ప్రదేశాలలో స్థానికులతో స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సీపీ పరిమళ హనా నూతన్, రక్షిత కృష్ణమూర్తి పాల్గొన్నారు.