12-03-2025 12:00:00 AM
కామారెడ్డి సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యాయవాది జగన్నాథం
కామారెడ్డి, మార్చి 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో 40 సంవత్సరాల క్రితం 1985లో కొందరు ఉత్సాహవంతులైన, విద్యాధికులైన యువకులు , ఉపాధ్యాయులు, డాక్టర్లు, లాయర్లు కలిసి “కామారెడ్డి సిటిజ న్స్ అసోసియేషన్” ఏర్పాటు చేయడం జరిగిందని ఏ రాజకీయ పార్టీకి, సమస్తకు సంబంధం లేదని కామారెడ్డి సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్నాథం తెలిపారు.
మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థ ప్రధాన ఆశయం కామారెడ్డి ప్రాంత పేద, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చి, ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా పరిష్కారాలు చేయించడం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు.
ఈ క్రమంలో కామారెడ్డి డిగ్రీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే ఉద్యమం, కామారెడ్డి ఆఫీసర్స్ క్లబ్ ప్రభుత్వ స్థలంలో ఉన్నందున ఆ భవనాన్ని ప్రభుత్వం సాధీనం చేసుకోవాలనే ఉద్యమం, సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం జరిగిన ఉద్యమాలు, పార్లమెంటు-అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి వేదికలు ఏర్పాటు చేయడం,
కామారెడ్డి ఆల్కహాల్ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం జరిగిన ఉద్యమం, బీడీ కార్మికులు, వృత్తి కార్మికుల హక్కుల కోసం జరిగిన ఉద్యమాలు, లారీ డ్రైవర్స్ సమస్యల కోసం, వారి హక్కుల కోసం జరిగిన ఉద్యమాలలో సిటిజన్స్ అసోసియేషన్ చురుకుగా పాల్గొన్న విషయం కామారెడ్డి ప్రాంత ప్రజలకు తెలిసిన విషయమే నన్నారు.