calender_icon.png 11 January, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగారెడ్డి జిల్లాలో వణికిస్తున్న చలి

11-01-2025 12:03:16 AM

  • అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు 
  • సంగారెడ్డి జిల్లాలో పెరిగిన చలి.. 
  • ఇబ్బందులు పడుతున్న ప్రజలు 

సంగారెడ్డి, జనవరి 10 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు చలి ఎక్కువగా ఉండడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. పగలు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగిపోయింది. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మండలం తో పాటు పలు మండలాలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఉదయం తొమ్మిది గంటలు అయినా చలి వదలడం లేదు. సాయంత్రం 6 గంటల నుంచి చలి తీవ్రత పెరిగిపోతుంది. అన్ని గ్రామాలలో పొగ మంచు అమ్మేస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పది డిగ్రీలలోపై ఉష్ణోగ్రతలు నమోదయితున్నాయి. చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

మరికొన్ని రోజులు చలి తీవ్రత ఇలానే ఉంటుందని అంచనా..

వాతావరణంలో మార్పులు రావడంతో మరికొన్ని రోజులు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఇస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత చలి తీవ్రత తగ్గే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. చలి తీవ్రత పెరిగిపోవడంతో చిన్నారులు వృద్ధులు అస్తమ రోగులు నానా అవస్థలు పడుతున్నారు .

ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరిగిపోతుంది. చలి తీవ్రంగా ఉన్నందున అత్యవసరమైతేనే రాత్రి సమయంలో బయటకు రావాలని తెల్లవారుజామున బయటకు రావద్దని వైద్యులు తెలుపుతున్నారు. చలి తీవ్రత తగ్గే వరకు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గ్రామాలలో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు ఇంటి ముందు చెల్లిమంటలు వేసుకొని కాపుకుంటున్నారు. ఎక్కడ చూసినా రాత్రి సమయంలో చెల్లి మంటలు గ్రామాలలో కనిపిస్తున్నాయి.

సౌకర్యాల కల్పనలో దూసుకెళ్తున్నముక్ట పూర్ పాఠశాల  

నాగల్ గిద్ధ, జనవరి 9 : నారాయణఖేడ్ నియోజకవర్గం లోని నాగల్ గిద్ద మండలం ముక్టపూర్ గ్రామంలో ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల పనిచేస్తున్నాయి అనడానికి ముక్టపూర్ పాఠశాల నిదర్శనం  ప్రభుత్వ పాఠశాలల్లో  సమాజంలో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం సన్నగిల్లుతున్న సమయంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వాళ్ల శక్తిని ధారపోసి ప్రభుత్వ పాఠశాలలు దేవాలయం తో సమానమని .

ఆ పాఠశాలలో చదువుతున్న పేద పిల్లల విద్యాభివృద్ధికై పాటుపడుతూ ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించేలా ఆ పాఠశాల అధ్యాపక బృందం పాఠశాలలో ఎన్నో మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూ ఈ సౌకర్యాల కల్పనలో దాతలను సైతం ఈ పాఠశాల అభివృద్ధిలో మమేకం చేస్తూ విధులలో చేరిన ఆరు నెలల లోపే పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పాఠశాల అది  మారుమూల ప్రాంతమైన నాగల్ గిద్ద మండలంలోని ముక్టపూర్ ప్రాథమిక పాఠశాల అది.

ఈ పాఠశాలకు ఏదో ఒకటి చేయాలి మార్పు తేవాలి అనే నినాదంతో ఆరు మాసాలలో 20వేల రూపాయలతో పాఠశాలకు సీసీ కెమెరాలను సమకూర్చి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఫర్నిచర్ రకరకాల వాటికి మంచి రక్షణగా నిలిచింది  అలాగే దాదాపు 18 వేల రూపాయలతో విద్యార్థులకు ఆకట్టుకునేలా ఆహ్లాదకరంగా గోడలపై రంగురంగుల చిత్రాలతో విద్యార్థులకు ఉపయోగపడే వివిధ రకాల వర్ణమాల ఎక్కాల ఏ బి సి డి ల చార్టులను బొమ్మలు  వేసి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు పరిగెత్తుకొని వచ్చేలా చేశారు. 

పేద విద్యార్థులకు ఆరోగ్యకరమైన పౌష్టికాహారంతో మధ్యాహ్న భోజనం రాష్ర్ట ప్రభుత్వం అందిస్తున్నది కానీ విద్యార్థులకు సురక్షితమైన తాగడానికి నీళ్లు లేవని ఉపాధ్యాయ బృందం ప్రతిరోజు రెండు మూడు మినరల్ వాటర్ బాటిళ్లు తెచ్చి విద్యార్థులకు మంచినీళ్లు తాగిస్తున్నారు    ఇలాంటి సత్కార్యాలు చేస్తున్న  ప్రధానోపాధ్యాయులు శ్రీ బాబు శెట్టి  ఉపాధ్యాయులు లింగమేశ్వర్ , సంగమేశ్వర్, మండల పిఆర్టియు అధ్యక్షులు శేరికర్ రమేష్ కు ముక్టపూర్ గ్రామ ప్రజలు గ్రామ యువకులు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.